Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అన్ని సంస్థలకు తెలంగాణ బోర్డులను ఏర్పాటు చేయండి: సీఎస్ రాజీవ్ శర్మ

అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. వారం రోజుల్లో రికార్డులను, ఇతర సామాగ్రిని సిద్ధం చేసుకోవాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. అన్ని ఛాంబర్లలో పూర్తి వసతులు కల్పించుకోవాలని సీఎస్ చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ పాలన సాఫీగా సాగేలా చర్యలు తీసుకోవాలని రాజీవ్ శర్మ చెప్పారు. అన్ని సంస్థలకు తెలంగాణ బోర్డులను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు.

More Telugu News