అంజలి వెంట మరో వ్యక్తి..?
హీరోయిన్ అంజలి మిస్సింగ్ కేసులో పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికీ ఆమె ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తును వేగవంతం చేశారు. అంజలి కాల్ లిస్టును పరిశీలించిన అధికారులు ఆమెకు సన్నిహితుడైన ప్రముఖుడిపై సందేహాలు వ్యక్తం చేసినట్టు సమాచారం. ఆమె ఫోన్ నుంచి ఆ ప్రముఖుడికి పలు కాల్స్ వెళ్ళడం వారి అనుమానాలకు బలం చేకూరుస్తోంది. దీంతో, అంజలి అతని వెంటే ఉన్నట్టు పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఆ వ్యక్తి గురించి అంజలి తల్లిని ఆరా తీసినట్టు తెలుస్తోంది. కాగా, అంజలి పిన్ని భారతీదేవి చెన్నైలో కిడ్నాప్ కేసు పెట్టిన నేపథ్యంలో అక్కడి పోలీసులు కూడా దర్యాప్తు ప్రారంభించారు.