తండ్రి కవితలను గానం చేయనున్న 'బిగ్ బి'
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ సుప్రసిద్ధ కవి అని తెలిసిందే. ఆయన కలం నుంచి జాలువారిన పలు కవితలు ఇప్పుడు అమితాబ్ కంఠంలో ప్రాణం పోసుకోనున్నాయి. తండ్రి కవితలను గానం చేయాలని బిగ్ బి నిర్ణయించుకున్నారు. త్వరలోనే పారిస్ లో జరిగే ఓ కార్యక్రమంలో ఈ ఆలాపన ఉంటుందని అమితాబ్ తన బ్లాగ్ లో పేర్కొన్నారు.