డిప్యూటీ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మండలి
టీడీపీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. బుద్ధప్రసాద్ ఎంపికను సభాపతి కోడెల అధికారికంగా ప్రకటించారు. అనంతరం మండలిని ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్ తో పాటు, అధికార పక్ష, ప్రతిపక్ష నేతలు అభినందించారు.