ఐటీహబ్ ను హెల్త్ హబ్ గా తీర్చిదిద్దుతాం: రాజయ్య
ఐటీ హబ్ గా పేరుగాంచిన హైదరాబాద్ నగరాన్ని హెల్త్ హబ్ గా తీర్చిదిద్దుతామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి రాజయ్య తెలిపారు. ఇండో-గ్లోబల్ హెల్త్ కేర్ సదస్సు ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో గడపగడపకు కార్పొరేట్ వైద్యం అందేలా చేస్తామని అన్నారు. నిమ్స్ ను ప్రక్షాళన చేసి దోషులను శిక్షిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాదులో ఉత్తమ సేవలు అందించిన ఆసుపత్రులకు 'హెల్త్ కేర్ ఎక్స్ లెన్స్' అవార్డులను ప్రధానం చేశారు.