సైకిలెక్కనున్న జూపూడి ప్రభాకరరావు
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధమైంది. ఈ సాయంత్రం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరతారని సమాచారం. 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కూడా టీడీపీలో చేరుతున్న సంగతి తెలిసిందే.