ఆంధ్రా కార్యాలయాలకు విద్యుత్ బంద్ చేస్తాం: తెలంగాణ ఇంజనీర్ల అసోసియేషన్
పీపీఏల రద్దు వివాదంలో తెలంగాణ ఉద్యోగులు తలదూర్చారు. పీపీఏలు రద్దు చేస్తే హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ కార్యాలయాలకు సెగ తగులుతుందని తెలంగాణ ఇంజనీర్ల అసోసియేషన్ కార్యాలయం హెచ్చరించింది. హైదరాబాదులో సమావేశమైన తెలంగాణ ఇంజనీర్ల అసోసియేషన్ నేతలు పీపీఏలు రద్దు చేస్తే ఆంధ్రా కార్యాలయాలకు విద్యుత్ సరఫరా నిలిపేస్తామని హెచ్చరించారు. తెలంగాణ అవసరాలకు సరిపడా విద్యుత్ ను ఏపీజెన్ కో సరఫరా చేయాల్సిందేనని వారు డిమాండ్ చేశారు.