నీటి పారుదల శాఖ ఇకపై బెజవాడ కేంద్రంగా పనిచేస్తుంది: దేవినేని
ఇకపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటి పారుదల మంత్రిత్వ శాఖ విజయవాడ కేంద్రంగా పనిచేస్తుందని ఆ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. రేపటి నుంచి నీటి పారుదల శాఖ సమీక్షలన్నీ విజయవాడలోనే నిర్వహిస్తానని తెలిపారు. అసెంబ్లీ, మంత్రివర్గ సమావేశాలు ఉన్నప్పుడు మాత్రమే తాను హైదరాబాద్ వస్తానని దేవినేని పేర్కొన్నారు.