ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ గా కాల్వ శ్రీనివాసులు
తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్, నలుగురు విప్ లను ఖరారు చేసింది. టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన శాసనసభా పక్షం చీఫ్ విప్ గా కాల్వ శ్రీనివాసులు, విప్ లుగా యామిని బాల, చింతమనేని ప్రభాకర్, మేడా మల్లికార్జున రెడ్డి, కూన రవికుమార్ లను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.