మధ్యాహ్నం తెలంగాణ రాష్ట్ర కేబినెట్ భేటీ
ఈ మధ్యాహ్నం ఒంటి గంటకు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ భేటీ కాబోతోంది. మంత్రులందరూ అందుబాటులో ఉండాలని ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో పోలవరం ఆర్డినెన్స్, రైతు రుణమాఫీ, విద్యుత్ ఒప్పందాలు తదితర అంశాలపై లోతుగా చర్చించే అవకాశం ఉంది. భేటీ అనంతరం 2.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు శాఖలవారీగా కేసీఆర్ సమీక్షలు నిర్వహించనున్నారు.