Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేకు ఛాతి నొప్పి... కేర్ కు తరలింపు

ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో భీమవరం టీడీపీ ఎమ్మెల్యే రామాంజనేయులు అస్వస్థతకు గురయ్యారు. స్వల్ప ఛాతీ నొప్పితో ఆయన బాధపడ్డారు. స్పీకర్ గా ఎన్నికైన కోడెలకు శుభాకాంక్షలు తెలిపే సమయంలో ఎమ్మెల్యే అస్వస్థతకు గురయ్యారు. దీంతో, ఆయనను చికిత్స నిమిత్తం వెంటనే కేర్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆయనకు పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం రామాంజనేయులు ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

More Telugu News