విభజన అనంతరం నల్లమలలో తొలి ఎన్ కౌంటర్...ముగ్గురు మావోయిస్టుల మృతి
రాష్ట్ర విభజన అనంతరం నల్లమల అడవుల్లో తొలిసారి తుపాకీ పేలింది. చాలా కాలంగా నిశ్శబ్ధంగా ఉన్న నల్లమల నెత్తురోడింది. పోలీసులు, మావోయిస్టుల ఎదురు కాల్పులతో నల్లమల ఫారెస్టు దద్దరిల్లింది. గుంటూరు-ప్రకాశం జిల్లా సరిహద్దుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిని విమలక్క, బాబురావు, సారధిగా పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, సంఘటనా స్థలం నుంచి ఏకే 47 రైఫిల్, ఎస్ఎల్ఆర్, 303 రైఫిల్, మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.