ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి సచివాలయ ఉద్యోగుల విరాళం
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి సచివాలయ ఉద్యోగులు కూడా తమ వంతు ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించారు. ఇవాళ సచివాలయంలో జరిగిన ఉద్యోగుల సమావేశంలో పాల్గొన్న చంద్రబాబుకు రెండు రోజుల మూలవేతనాన్ని రాజధాని నిర్మాణం కోసం విరాళంగా ఇస్తున్నట్లు చెప్పారు. అలాగే, ఆర్థిక శాఖ మహిళా ఉద్యోగి ఒకరు తన చేతికున్న నాలుగు బంగారు గాజులను తీసి రాజధాని నిర్మాణానికి విరాళంగా ఇచ్చేశారు.