భారత సంతతి శాస్త్రవేత్తకు ప్రతిష్ఠాత్మక 'వరల్డ్ ఫుడ్ ప్రైజ్'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భారత సంతతి శాస్త్రవేత్తకు ప్రతిష్ఠాత్మక 'వరల్డ్ ఫుడ్ ప్రైజ్'

భారత్ సంతతి వృక్ష శాస్త్రవేత్త డాక్టర్ సంజయ్ రాజారామ్ ను ప్రతిష్ఠాత్మక 'వరల్డ్ ఫుడ్' ప్రైజ్ వరించింది. గోధుమ అధికోత్పత్తికి ఉపయోగపడే మేలుజాతి వంగడాల సృష్టిలో రాజారామ్ భాగస్వామ్యానికి గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. మొత్తం 480కి పైగా గోధుమ విత్తనాల రకాలను రాజారామ్ రూపొందించారు. రాజారామ్ కార్యసాధన తమకందరికీ ఎంతో స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా అమెరికా ప్రభుత్వ కార్యదర్శి జాన్ కెర్రీ కొనియాడారు.

More Telugu News