ఆపిల్, శాంసంగ్ లకు పోటీగా 'ఫైర్'
ఆన్ లైన్ వాణిజ్య పోర్టల్ అమెజాన్ హైఎండ్ ఫోన్ల సెక్టార్లోకి అడుగుపెట్టింది. ఆపిల్, శాంసంగ్ లకు దీటుగా 'ఫైర్' అనే మోడల్ తో రంగప్రవేశం చేసింది. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ వాషింగ్టన్లో ఈ త్రీడీ స్మార్ట్ ఫోన్ ను ఆవిష్కరించారు. 4.7 అంగుళాల టచ్ స్క్రీన్ కలిగిన ఈ ఫోన్ తో హెచ్ డీ నాణ్యతతో ఫొటోలు తీయవచ్చు. అంతేగాకుండా, అమెజాన్ ఉచితసేవలను కూడా అందుకునే సౌలభ్యం కల్పించారు.
క్లౌడ్ స్టోరేజ్ సాయంతో వేలకొలది పాటలను, ఛాయాచిత్రాలను నిక్షిప్తం చేసుకునే వీలుంది. ఇక, ఉత్పత్తుల బార్ కోడ్లను స్కాన్ చేసుకునే సాంకేతికత 'ఫైర్' సొంతం. 13 మెగాపిక్సెల్ కెమెరా, క్వాడ్ కోర్ ప్రాసెసర్ దీని ప్రత్యేకతలు. ఆండ్రాయిడ్ ఫోర్క్ డ్ వెర్షన్ ఓఎస్ తో పనిచేస్తుంది. ధరను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.