సెనెటర్ కుమారుడి హత్య
పాకిస్థాన్ లో ఓ సెనెటర్ కుమారుడు హత్యకు గురయ్యాడు. తెల్లవారు జామున దక్షిణ వజీరిస్థాన్ లో జమైతే ఉలేమా-ఇ-ఫాజల్ (జెయూఐ-ఎఫ్) నేత, పాకిస్థాన్ ఫెడరల్లీ అడ్మినిస్టెర్డ్ ట్రైబల్ ఏరియా (ఎఫ్ఏటిఏ) సెనెటర్ సలే షా కుమారుడు షామ్ సుల్ ఇస్లామ్ పై కొందరు దుండగులు దాడిచేసి హతమార్చారు. దీనిపై సమాచారం అందుకున్న ఎఫ్ఏటిఏ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను తొందర్లోనే పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని అధికారులు తెలిపారు.