శాసనసభలో జగన్ ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైఎస్సార్సీపీ అధినేత జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. శాసనసభ సభ్యుడిగా అసెంబ్లీకి తొలిసారిగా హాజరయిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేత ప్రొటెం స్పీకర్ పతివాడ నారాయణస్వామినాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత జగన్ ప్రమాణం చేశారు. గతంలో ఎంపీగా పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించిన జగన్ అసెంబ్లీకి తొలిసారి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.