తెలంగాణలో ఏడుగురు డిప్యూటీ కలెక్టర్లకు పోస్టింగులు
తెలంగాణ రాష్ట్రంలో ఏడుగురు డిప్యూటీ కలెక్టర్లకు పోస్టింగులు, ట్రాన్స్ ఫర్లపై ఆదేశాలు జారీ అయ్యాయి. మాసుమా బేగం, కె.వెంకటేశ్వర్లు, సత్యనారాయణ ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ యూఎల్ సీ ఎస్ వోగా సత్తయ్య, ఎస్ఆర్ఎస్పీ స్పెషల్ కలెక్టరుగా వి.ఆనందరావు, భద్రాచలం ఆర్డీవోగా ఆర్.అంజయ్య, పాల్వంచ ఆర్డీవోగా కె. వెంకటేశ్వర్లు నియమితులయ్యారు.