రాజమండ్రిలో రైతు కూలీ సంఘం రాష్ట్ర మహాసభలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాజమండ్రిలో రైతు కూలీ సంఘం రాష్ట్ర మహాసభలు

రైతు కూలీ సంఘం రాష్ట్ర ఎనిమిదో మహాసభకు రాజమండ్రి ముస్తాబయింది. ఈ నెల 18, 19 తేదీల్లో రాష్ట్ర మహాసభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. దీనిలో భాగంగా ఇవాళ రాజమండ్రిలో రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అరుణోదయ కళాకారుల సంఘం నేతృత్వంలో విప్లవ గీతాలను ఆలపిస్తూ సభను విజయవంతం చేయాలని కోరారు. ఆటపాటలతో ప్రదర్శన జరిపారు. రాజమండ్రి దేవీ చౌక్ నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శన మహాసభకు వేదికైన సుబ్రహ్మణ్యం మైదానం వరకు కొనసాగింది.

More Telugu News