ఉత్తరప్రదేశ్ గవర్నర్ రాజీనామా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఉత్తరప్రదేశ్ గవర్నర్ రాజీనామా

ఉత్తరప్రదేశ్ గవర్నర్ బీఎల్ జోషి తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా లేఖను హోం మంత్రిత్వ శాఖకు పంపించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం యూపీఏ హయాంలో నియమించిన గవర్నర్లను మార్చాలని యోచిస్తోందన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో జోషి తన రాజీనామాను సమర్పించారు. ఆయన పదవీకాలం వచ్చే నెలతో ముగియనుంది. యూపీఏ-2 హయాంలో నియమించిన ఉత్తరప్రదేశ్, కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల గవర్నర్లను మార్చాలని కేంద్రం యోచిస్తోందని ఊహగానాలు ఊపందుకున్నాయి.

More Telugu News