తిరుమలకు పోటెత్తిన భక్తులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తిరుమలకు పోటెత్తిన భక్తులు

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు భక్తులు పోటెత్తారు. తిరుమలేశుని దర్శనానికి భక్తులు బారులు తీరారు. శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి వేచి ఉన్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1,2 లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. వైకుంఠం వెలుపల ఒక కిలోమీటరు వరకు భక్తుల క్యూలైన్ ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం, కాలినడకన వచ్చే భక్తుల దివ్యదర్శనానికి 12 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు చెప్పారు.

More Telugu News