ఆచూకీ దొరకలేదు... అన్వేషణ ఆగలేదు
హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో గల్లంతైన ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం ఎనిమిదో రోజూ అన్వేషణ కొనసాగుతోంది. అయితే గాలింపు చర్యల వల్ల పెద్దగా ఫలితం లేకుండా పోతోంది. ఇవాళ సోనార్ పరికరంతో గాలింపు చేస్తున్నామని అధికారులు చెప్పారు. ఇవాళ్టి నుంచి గల్లంతైన ప్రాంతం నుంచి వ్యతిరేక దిశలో గాలింపు చర్యలు చేపడుతున్నట్టు వారు చెప్పారు. మరోవైపు విద్యార్థుల మృతదేహాల కోసం తల్లిదండ్రులు ఘటనా స్థలంలోనే కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు.