శ్రీనివాసన్ కు సుప్రీంకోర్టులో ఊరట
బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఐపీఎల్-6లో శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్ అవినీతికి పాల్పడినందున, సొంత అల్లుడినే అవినీతి చేయకుండా నిరోధించలేకపోయిన వ్యక్తి ఐసీసీ చీఫ్ పదవికి అనర్హుడని సూచిస్తూ, అతన్ని ఐసీసీ చీఫ్ పదవికి పోటీ చేయకుండా నిరోధించాలని కోరుతూ వేసిన పిటీషన్ పై వెంటనే విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో శ్రీనివాసన్ ఐసీసీ చీఫ్ పదవికి పోటీ చేయడానికి తొలి విఘ్నం తొలగిపోయినట్టైంది.