విండోస్ ఫోన్లను నేడు ఆవిష్కరించనున్న మైక్రోమ్యాక్స్
మైక్రోమ్యాక్స్ రెండు లేదా మూడు విండోస్ ఫోన్లను నేడు విడుదల చేయనుంది. ఇవి 8.1 విండోస్ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేసేవని సమాచారం. వీటి ధర బడ్జెట్ ఫోన్ల రేంజ్ లో ఉంటుందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు. వీటితోపాటు మరికొన్ని ఇతర స్మార్ట్ ఫోన్లను కూడా ఢిల్లీలో ఆవిష్కరించనుంది.