మోడీ భూటాన్ పర్యటనతో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం: సుష్మాస్వరాజ్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భూటాన్ పర్యటనతో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు బలపడ్డాయని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ పేర్కొన్నారు. భూటాన్ లోని 20 జిల్లాల్లో త్వరలో ఈ-లైబ్రరీలు ఏర్పాటు చేస్తామని ఆమె ప్రకటించారు. ప్రస్తుతం మోడీ భూటాన్ పర్యటనలో ఉన్నారు.