తంగిరాల భౌతికకాయానికి నివాళి అర్పించిన చంద్రబాబు
కృష్ణా జిల్లా నందిగామ శాసనసభ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు భౌతికకాయానికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కృష్ణా జిల్లాలో టీడీపీ అభివృద్ధికి తంగిరాల ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆయన మరణం పార్టీకి, ప్రజలకు తీరని లోటు అని చెప్పారు. న్యాయవాదిగా ఆయన ఎంతో పేరు తెచ్చుకున్నారని అన్నారు. ప్రభాకర్ రావు మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తంగిరాల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.