Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చంద్రబాబుపై ఈసీకి ఫిర్యాదు చేస్తాం: సీపీఐ నారాయణ

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సీపీఐ నేత నారాయణ మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. కమిటీల పేరుతో రైతు రుణమాఫీని చంద్రబాబు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు వైఖరిపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం మన దేశం మతతత్వ శక్తుల చేతుల్లోకి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 19 నుంచి 22 వరకు ఢిల్లీలో సీపీఐ జాతీయ సమావేశాలు జరుగుతాయని వెల్లడించారు. తమిళనాడు తరహాలో ఏపీ, తెలంగాణల్లో మద్యం పాలసీని అమలు చేయాలని సూచించారు.

More Telugu News