ప్రీతి జింటా కేసులో నెస్ వాడియా అరెస్టుకు ఆదేశాలు
బాలీవుడ్ సినీ నటి ప్రీతి జింటా ఫిర్యాదుపై మహిళా సంఘాల ఆందోళనతో మహారాష్ట్ర మహిళా కమిషన్ స్పందించింది . 24 గంటల్లోగా నెస్ వాడియాను అరెస్టు చేయాలంటూ పోలీసులకు అల్టిమేటం జారీ చేసింది. మరోవైపు, ప్రీతి జింటా కేసును సుమొటోగా స్వీకరించాలని జాతీయ మహిళా కమిషన్ (ఎన్ సిడబ్ల్యూ) నిర్ణయించింది. ప్రీతి జింటాకు జరిగిన అవమానంపై సమగ్రంగా విచారించనున్నట్టు ఎన్ సిడబ్ల్యూ ఛైర్ పర్సన్ మమతా శర్మ తెలిపారు.
ప్రీతి జింటా నుంచి ఉదయం ఫిర్యాదు అందుకున్న ముంబై మెరైన్ డ్రైవ్ పోలీసులు, నెస్ వాడియాపై 354, 504, 506, 509 సెక్షన్లపై కేసులు నమోదు చేశారు. ఐపీఎల్ సీఈవో సుందర్ రామన్ స్టేట్ మెంట్ రికార్డు చేసిన పోలీసులు, ఆ రోజు ఏం జరిగిందనే దానిపై వాంఖడే స్టేడియం సిబ్బందిని విచారించనున్నారు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ప్లేయర్ల నుంచి కూడా పోలీసులు ఈ ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.