విజయవాడలో 200 కోట్లతో 2.3 కిలోమీటర్ల ఫ్లైఓవర్ నిర్మిస్తాం: కేశినేని
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విజయవాడలో 200 కోట్లతో 2.3 కిలోమీటర్ల ఫ్లైఓవర్ నిర్మిస్తాం: కేశినేని

విజయవాడలో కనకదుర్గ దేవాలయం మీదుగా 2.3 కిలోమీటర్ల ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తామని ఎంపీ కేశినేని నాని తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ఫ్లై ఓవర్ నిర్మాణానికి ఏవైనా ఆటంకాలు ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని పరిశీలించేందుకు నిపుణులను సంప్రదించామని, వారి అభిప్రాయం మేరకు ఫ్లైఓవర్ నిర్మాణం సాధ్యమని అన్నారు. సుమారు 200 కోట్ల రూపాయలతో 2.3 కిలోమీటర్ల ఫ్లైఓవర్ డిజైన్ తో కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతున్నామని, డిజైన్ కు ఆమోదం లభించగానే పనులు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.

రానున్న రెండు లేక మూడేళ్లలో ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల దుర్గ గుడి దగ్గర ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంతో పాటు, నగరంలో భారీ వాహనాల రద్దీని తగ్గిస్తామని ఆయన అన్నారు. గతంలో భూమి నాణ్యత లేనందున ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం అసాధ్యమని మాజీ ఎంపీ లగడపాటి పలుమార్లు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News