Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఉమ్మడి రాజధాని పరిధిపై గవర్నర్ తో చర్చించిన ఉన్నతాధికారులు

ఉమ్మడి రాజధాని పరిధిపై చర్చించేందుకు రెండు రాష్ట్రాల అత్యున్నత స్థాయి అధికారులు గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యారు. రాజ్ భవన్ లో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులు, ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు అనురాగ్ శర్మ, జేవీ రాముడు, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉమ్మడి రాజధాని పరిధి, నిబంధనలు వంటి విషయాలపై గవర్నర్ తో అధికారులు చర్చించారు. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండనున్న విషయం తెలిసిందే.

More Telugu News