తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హాస్యనటుడు రాజేంద్రప్రసాద్
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు హాస్య నటుడు రాజేంద్రప్రసాద్ వచ్చారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజనతో సినీ పరిశ్రమ డోలాయమాన పరిస్థితిలో ఉందని అన్నారు. సినీ పరిశ్రమ ఏ రాష్ట్రంలో ఉన్నా ఒక్కటేనని రాజేంద్రప్రసాద్ అన్నారు.