రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను కొనసాగించాలి: జానారెడ్డి
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చకపోతే వారు తిరగబడే అవకాశం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి హెచ్చరించారు. కాలపరిమితితో కూడిన ప్రణాళిక తయారుచేసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని... ప్రణాళిక ప్రకారం హామీలన్నీ నెరవేర్చాలని అన్నారు. ఈ రోజు టీ.శాసనసభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఇచ్చిన యూపీఏకు, సోనియాకు సీఎం కేసీఆర్ అభినందనలు తెలపాలని సూచించారు.
రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను కొనసాగించాలని... అలాగే, హైదరాబాదులో శాంతిభద్రతలను కాపాడాలని జానారెడ్డి అన్నారు. హామీలన్నీ నెరవేర్చి నవ తెలంగాణ నిర్మాణం చేయాలని సూచించారు. మైనార్టీలకు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ ఎలా ఇస్తారో తెలపాలని డిమాండ్ చేశారు. గవర్నర్ ప్రసంగంలో పోలవరం అంశాన్ని ఎందుకు చేర్చలేదని నిలదీశారు. అన్ని రకాల అవినీతిని అంతమొందించాలని కోరారు.