రూ.1,500కే మొజిల్లా స్మార్ట్ ఫోన్
కనీసం ఓ ఏడు వేలు పోస్తే కానీ ప్రముఖ కంపెనీల స్మార్ట్ ఫోన్ రాని పరిస్థితి. అంత వెచ్చించి కొనలేని వారి పరిస్థితి ఏంటి? అలాంటి వారికి త్వరలో మంచి రోజులు రానున్నాయి. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ దర్శనం ఇచ్చే రోజు త్వరలోనే రానుంది! ప్రముఖ వెబ్ బ్రౌజర్ కంపెనీ మొజిల్లా ఫైర్ ఫాక్స్ 1500 రూపాయలకే స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు భారతీయ మొబైల్ తయారీ కంపెనీలు స్పైస్, ఇంటెక్స్ మొబైల్స్ తో జట్టుకట్టింది. 1500 రూపాయలకే స్మార్ట్ ఫోన్ ను తీసుకురానున్నామని మొజిల్లా ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వెల్లడించినా, ఇప్పుడు ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. రానున్న నెలల్లోనే ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.