Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖ జిల్లాల్లో ఒంటిపూట బడులు

అప్పుడే జూన్ నెల సగం కరిగిపోయినా, ఎండలు ఇంకా మండుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో వేడి, వడగాలులతో వృద్ధులు మరణించారు. దాంతో, బయట తిరగాలంటే ప్రజలు భయపడుతున్నారు. అటు కృష్ణా జిల్లా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల్లో అయితే ఎండలు ఉదయం నుంచే వణికిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ జిల్లాల్లో పాఠశాలలను ఒక్కపూటే నిర్వహించాలని విద్యాశాఖాధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించి జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు.

More Telugu News