నాన్న ఫోటోతో పాటు నా ఫోటో కూడా ఉండాలి: జగన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాన్న ఫోటోతో పాటు నా ఫోటో కూడా ఉండాలి: జగన్

ప్రతి ఇంట్లోనూ నాన్న ఫోటో ఉందని వైఎస్సార్సీపీ అధినేత జగన్ అన్నారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, తన తండ్రిని గుర్తుంచుకున్నట్టే ప్రజలంతా తనను కూడా ఆదరించి, గుర్తుంచుకోవాలని ఆశిస్తున్నానని తెలిపారు. విశాఖ తూర్పు, భీమిలి, విజయనగరం జిల్లా ఎస్ కోట నియోజకవర్గాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి కావాలని అందరికీ ఉంటుందని తెలిపిన ఆయన, అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి కాదలుచుకోలేదని అన్నారు.

పదవి కోసం గడ్డితినే అలవాటు తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. మోసం చేసి పదవుల్లో ఉంటే ప్రజలు హర్షించరని ఆయన అభిప్రాయపడ్డారు. సీఎంగా నిజాయతీతో సుపరిపాలన సాగించాలన్న ఆయన... అబద్దాలు చెప్పకుండా, మోసం చేయకుండా ముఖ్యమంత్రి అవుతానని చెప్పారు.

More Telugu News