విశాఖ జిల్లా అభివృద్ధిపై చర్చిస్తున్న ఏపీ కేబినెట్
విశాఖ జిల్లా అభివృద్ధిపై ఏపీ కేబినెట్ చర్చిస్తోంది. ఉదయం 11:30 గంటలకు సమావేశమైన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ముఖ్యమంత్రి బాబు చేసిన ఐదు సంతకాలపై చర్చించింది. మధ్యాహ్నం భోజనానంతరం సమావేశమైన కేబినెట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై చర్చించింది. ప్రస్తుతం విశాఖ జిల్లా అభివృద్ధిపై చర్చిస్తోంది.
విశాఖ జిల్లా అభివృద్ధిపై ఎనిమిది అంశాలపై జీవీఎంసీ, వుడా, స్టీల్ ప్లాంట్ అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కేబినెట్ కు చూపించారు. సింహాచలం దేవస్థానం భూములపై సమీక్ష జరిపారు. జిల్లా అభివృద్ధికి అవసరమయ్యే అన్ని చర్యలు చేపట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. సుదీర్ఘంగా సాగుతున్న సమావేశంలో మరిన్ని అంశాలపై చర్చించనున్నారని సమాచారం.