Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నర్మదా డ్యామ్ ఎత్తు పెంచేందుకు గ్రీన్ సిగ్నల్... రెండు లక్షల మందిపై ప్రభావం

అహ్మదాబాద్ లోని నర్మదా నదిపై నిర్మించిన సర్ధార్ సరోవర్ డ్యామ్ ఎత్తును 17 మీటర్ల వరకు పెంచేందుకు డ్యామ్ అధికారులు అనుమతిచ్చారు. ఈ పెంపు వల్ల అక్కడి ప్రాంతాల్లో నివసిస్తున్న రెండు లక్షల 50వేల మందిపై ప్రభావం పడుతుందని ఎన్ బీఏ (నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ) చెబుతోంది. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత, గతంలో నర్మదా బచావో ఆందోళనలో పాల్గొన్న మేథా పాట్కర్ మాట్లాడుతూ, ఈ నిర్ణయం అన్యాయం, అప్రజాస్వామికమని వ్యాఖ్యానించారు. డ్యామ్ కు చుట్టు పక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. సంబంధిత శాఖ ఇక్కడి పరిస్థితిని అంచనా వేసి ఏ నిర్ణయమైనా తీసుకోవాలని కోరారు.

More Telugu News