Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సర్కారుకు మొట్టికాయలు వేద్దాం రండి: మోత్కుపల్లి

రాష్ట్ర ప్రజలపై వివిధ రకాల ఛార్జీల పేరిట ప్రభుత్వం అధిక భారం మోపుతోందని తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. ప్రజలను గాలికొదిలేసి, ప్రభుత్వం చేతులు దులుపుకుంటోందని ఆయన విమర్శించారు. అందుకే, ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రేపు తలపెట్టిన బంద్ ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. విద్యుత్ సమస్యలను పట్టించుకోని సర్కారుకు మొట్టికాయలు వేయాలని మోత్కుపల్లి ప్రజలకు సూచించారు. బంద్ నిర్వహణలో టీడీపీ ముందు ఉంటుందని ఆయన తెలిపారు.

తెలుగుదేశం పాలన గురించి చెబుతూ.. రాష్ట్రంలో కరవు తాండవిస్తున్న వేళ సైతం వ్యవసాయానికి 9 గంటల పాటు నిరంతరాయంగా కరెంటు సరఫరా చేశామని చెప్పారు. రూ. 40 వేల కోట్ల బడ్జెట్ మాత్రమే ఉన్న సమయంలోనూ రూ. 4 వేల కోట్లను విద్యుత్ కోసం కేటాయించిన ఘనత చంద్రబాబుదే అని ఆయన పేర్కొన్నారు.

More Telugu News