ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చినట్లుగానే తెలంగాణకు కూడా ఆ హోదా ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరతామని ఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపీలు తెలిపారు. అంతేకాక, తెలంగాణ బిల్లులో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఆ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో ఉన్న సంగతి తెలిసిందే. సాయంత్రం వీరంతా కలసి మోడీని కలవనున్నారు.