డీజీపీ కార్యాలయంలో జూ.ఎన్టీఆర్, రాజమౌళి...
రాష్ట్ర పోలీస్ బాస్ డీజీపీ కార్యాలయంలో ఇవాళ సందడి వాతావరణం నెలకొంది. సినీ ప్రముఖులు ఒక్కసారిగా తరలి రావడంతో వారిని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. దీంతో రవీంధ్రభారతి ప్రాంతంలో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పైరసీ మొబైల్ అప్లికేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సినీనటులు జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు రాజమౌళి, సినీ నిర్మాతలు రామానాయుడు, అల్లు అరవింద్ పాల్గొనగా, అమెరికా రాయబారి నాన్సీ జె.పాల్ పైరసీ అప్లికేషన్ ను ప్రారంభించారు.