మోడీ ప్రభుత్వాన్ని 101వ రోజు నుంచే ప్రశ్నిస్తాం: ఆప్
ప్రధాని నరేంద్ర మోడీ నిర్దేశించుకున్న వంద రోజుల కార్యక్రమం వరకు సైలెంట్ గా ఉంటామని... ఆ తర్వాత ప్రధాన సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని 'ఆప్' ఎంపీలు హెచ్చరించారు. దేశాన్ని పట్టి పీడిస్తున్న నిరుద్యోగం, పేదరికం, ద్రవ్యోల్బణాలను పరిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు. ఈసారి నలుగురు ఆమ్ ఆద్మీ ఎంపీలు లోక్ సభలో అడుగుపెట్టారు. దేశ సమస్యలను మోడీ ప్రభుత్వం పరిష్కరించలేకపోతే కడిగి పారేస్తామని ఆప్ ఎంపీలు అన్నారు.