తిరుమలేశుని దర్శనానికి భక్తులు పోటెత్తారు. శనివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2 లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. వెలుపల రెండు కిలోమీటర్ల వరకు భక్తుల క్యూ లైన్ ఉంది. స్వామివారి సర్వ దర్శనానికి 28 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 16 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ పెరగడంతో ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని ఉదయం 11 గంటలకే నిలిపివేశారు.