Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కుక్కలతో 'బండి' లాగించేస్తున్నాడు!

చిన్నవయసులో పిల్లలకు ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. అయితే వీటిని ఆచరణలో పెట్టాలంటే ఆ పసిమనసులకు ఎన్నో అడ్డంకులు. కానీ, ఈ చిన్నోడు అనుకున్నది చేసి చూపించాడు. అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాడు. ఈ బుడతడి పేరు మహేష్. ఉండేది మహబూబ్ నగర్ జిల్లా బల్మూరు మండలం చెన్నారం గ్రామం. సైకిల్ చక్రాలతో బండి తయారు చేసి తాను పెంచుకుంటోన్న పెంపుడు శునకాలతో బండి లాగించేస్తున్నాడు. పొలంలోని కట్టెలు..ఇతరత్రా పనులకు తన బండిని ఉపయోగించుకుంటూ ముందుకు పోతున్నాడు. ఇంధనం ఖర్చులేకుండా తన సొంతబండి నడుపుకుంటూ వెళ్లి, ఇంట్లో పనులు చక్కబెట్టేస్తున్నాడు. అంతేకాదు.. నలుగురి కళ్లూ తనవైపు తిప్పుకుంటూ గర్వంగా సాగిపోతున్నాడు.

More Telugu News