తెలంగాణ గవర్నర్ గా జూన్ 2న ఉదయం ఆరున్నర గంటలకు ఈఎస్ఎల్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్ భవన్ దర్బార్ హాల్లో హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. తర్వాత అదే రోజు ఉదయం 8.15 నిమిషాలకు కేసీఆర్ చేత తెలంగాణ ముఖ్యమంత్రిగా గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు.