బట్టతలతో గుండెజబ్బులకు లంకె
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బట్టతలతో గుండెజబ్బులకు లంకె

'మీకు బట్టతల ఉందా? అయితే మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే..' అంటున్నారు పరిశోధకులు. బట్టతల వ్యక్తుల్లో 32 శాతం అధికంగా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుందట. టోక్యో యూనివర్శిటీ పరిశోధకులు చేసిన అధ్యయనంలో ఈ విషయం తెలిసింది.

వర్శిటీకి చెందిన డా.టొమొహిడే యమాడా నేతృత్వంలో సుమారు 37 వేలమందిపై ఈ విషయమై పరిశోధనలు చేశారు. బట్టతలకు, హృద్రోగాలకు సంబంధం ఉన్నట్టు తమ పరిశోధనల  ద్వారా స్పష్టమైందని యమాడా తెలిపారు. అయితే,  ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లతో గుండెకు ప్రత్యక్ష ముప్పు ఉంటుందని, దానితో పోల్చితే బట్టతల కారణంగా పొంచి ఉండే ముప్పు తక్కువేనని ఆయన వివరించారు. 

More Telugu News