హీరో మహేష్ బాబుపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు
ప్రముఖ టాలీవుడ్ నటుడు మహేష్ బాబు మీద రాష్ట్ర మానవహక్కుల కమిషన్ లో కేసు నమోదైంది. మద్యం ప్రకటనలో మహేష్ బాబు నటించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అతని అభిమాని నాయక్ ఈ ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదును స్వీకరించిన కమిషన్ జూన్ 5లోగా దీనికి సంబంధించి సమగ్ర నివేదిక ఇవ్వాలని డీజీపీకి ఆదేశాలు జారీచేసింది.