హ్యాపీ బర్త్ డే టు 'మొబైల్ ఫోన్'!
మనుషుల మధ్య భావ ప్రసారానికి, సమాచార వినిమయానికి ప్రధాన వాహకమైన ఉత్తరాన్ని నిలువునా పాతరేసిన ఘనత నిస్సందేహంగా మొబైల్ ఫోన్ దే. అలాంటి చరిత్ర కలిగిన మొబైల్ ఫోన్ పుట్టి నేటికి 40 ఏళ్ళయింది. 1973 ఏప్రిల్ 3న మోటారోలా కంపెనీ విప్లవాత్మక సెల్యులర్ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ పరికరం ఇప్పుడు సర్వాంతర్యామియై దర్శనమిస్తోంది.
నాలుగు దశాబ్దాల క్రితం.. ఓ రోజు, మోటారోలా కంపెనీలో సీనియర్ ఇంజినీర్ అయిన మార్టిన్ కూపర్, ప్రత్యర్థి కమ్యూనికేషన్స్ కంపెనీ ఉద్యోగితో తాను ఇప్పుడు సెల్యులర్ ఫోన్ లో మాట్లాడుతున్నట్టు చెప్పి సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాడు. అది మొదలు ఈ క్షణం వరకు సెల్ లేనిదే ఒక్క నిమిషం గడవని స్థితికి మానవాళి చేరిందంటే అంతా టెక్నాలజీ మహిమే. ఎక్కడో సుదూరాన ఉన్న వ్యక్తులతో సైతం నిస్తంత్రీ విధానంలో సంభాషించడం ఓ దశలో మహాద్భుతమే అయింది.
ఇంతటి దివ్యోపకరణాన్ని మనకందించిన మార్టిన్ కూపర్ మహాశయుడు నేడు 85వ పడిలో ఉన్నాడట. ఆయన్ను 'ఫాదర్ ఆఫ్ మొబైల్ ఫోన్' అని పిలవడం సబబే. కాగా, సెల్ ఫోన్ ను ఆవిష్కరించిన సంస్థ మోటారోలా నేడు సోదిలో కూడా లేకుండా పోవడం విస్మయం కలిగిస్తోంది. నోకియా, శాంసంగ్, సోనీ ఎరిక్సన్, ఎల్జీ వంటి దిగ్గజాలకు తోడు చైనా మొబైళ్ళ ప్రవాహంలో మోటారోలా ఎప్పుడో కొట్టుకుపోయిందన్నది టెక్ జనుల మాట.

More Telugu News
-
ఏపీ మున్సిపల్ ఎన్నికల బరిలో ఎంఐఎం.. 21 స్థానాల్లో పోటీ
-
టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కేసు.. ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు
-
దామరచర్లలో గుంజకు కట్టి కొట్టినా తప్పులేదు: కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
-
జనాలతో కలవాలని ఉంటుంది.. కానీ నాకు ఆ స్కిల్స్ లేవు: అక్షయ్
-
మహిళలపై నేరాల కేసులు.. దేశంలోనే ఏపీకి రెండో స్థానం!
-
అమెరికా వీసా టెన్షన్.. హైదరాబాద్‌లో యువకుడి ఆత్మహత్య
-
కొత్త ప్రాజెక్ట్‌పై ‘కాంతార’ బ్యూటీ రుక్మిణి ఎమోషనల్ పోస్ట్!
-
నవంబర్ నుంచి చింతలపూడి పనులు: చంద్రబాబు
-
కోతులు వెంటపడడంతో గుండె ఆగి బాలుడి మృతి
-
వెంకీ-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం'.. ట్రైలర్ వచ్చేసింది!
-
ఇషాన్ కిషన్ కు గాయం.. టీమిండియాలోకి యువ వికెట్ కీపర్ ఎంట్రీ
-
హోండా 'మోట్రా' మళ్లీ వస్తోందా?
-
‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్.. హాలిడే ప్రకటించిన మల్లారెడ్డి కోడలు
-
కరోనా సమయంలో కేసీఆర్ మాటలు నమ్మి జనం శ్మశానాలకు చేరారు: సీఎం రేవంత్ రెడ్డి
-
సద్గురు చెప్పిన పల్లీ బ్రేక్ ఫాస్ట్.. మూడు నిమిషాల రెసిపీ!