Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జైలు నుంచి విడుదలయిన ఒడిషా మాజీ మంత్రి

వరకట్నం వేధింపుల కేసులో రెండు రోజుల కిందట కోల్ కతాలో అరెస్టయిన ఒడిషా న్యాయశాఖ మాజీ మంత్రి రఘునాధ్ మొహంతి, ఆయన భార్య ప్రీతిలత ఈ రోజు జైలు నుంచి విడుదలయ్యారు. మూడురోజులు జైలులో గడిపిన వీరికి స్థానిక బాలాసోర్ 'సబ్ డివిజినల్ జుడిషియల్ మేజిస్ట్రేట్' కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

అదనపు కట్నంకోసం తనను వేధిస్తున్నారంటూ మొహంతి కోడలు బర్షాసోనీ గతనెలలో కుటుంబ సభ్యులందరిపైనా ఫిర్యాదు చేసింది. దీంతో పదవికి రాజీనామా చేసిన మొహంతి రెండు వారాల పాటు అదృశ్యమయ్యారు. అనంతరం కోల్ కతాలో పోలీసులకు దొరికిపోయారు. 

More Telugu News