Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అంగారక గ్రహాన్ని చూడడమే నా అంతిమ లక్ష్యం: సునీతా విలియమ్స్

భారతీయ అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ భారత్ లో పర్యటనను ప్రారంభించారు. ముందుగా దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్న ఆమె, ఇక్కడి 'జాతీయ సైన్స్ సెంటర్' ను సందర్శించారు. అనంతరం ఎంపిక చేసిన విద్యార్ధలు, ఉపాధ్యాయులు, పలువురితో సమావేశమై, తన అంతరిక్ష యాత్రకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకు న్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సునీత.. అంగారకగ్రహాన్ని చూడటమే తన అంతిమ లక్ష్యమని తెలిపింది.

అంతరిక్షంలో తనకు ఎలాంటి గ్రహాంతరజీవులు (ఏలియన్స్) తారసపడలేదని ఆమె నవ్వుతూ చెప్పింది. అంతరిక్షంలో తనతోపాటుగా ఉపనిషత్తులు, భగవద్గీత కాపీలను  తీసుకెళ్లానని వివరించింది. ఇంకా సమోసాలు కూడా తనతో పాటు ఉన్నాయంది. లక్ష్యానికి తగిన విధంగా తనను ప్రోత్సహించే భర్త, కుటుంబం దొరకడం తన అదృష్టమని పేర్కొంది. తల్లిదండ్రులే తనకు పెద్ద 'రోల్ మోడల్స్' అని సునీత తెలిపింది.

More Telugu News