ఈ అండర్‌వేర్‌ లతో అత్యాచారాలకు చెక్‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈ అండర్‌వేర్‌ లతో అత్యాచారాలకు చెక్‌

చెన్నైకు చెందిన విద్యార్థులు ఓ నవీన అద్భుతమైన ఆవిష్కరణతో ముందుకొచ్చారు. ఒంటరి మహిళలకు వరప్రసాదిని వంటి ఆవిష్కరణ ఇది. అత్యాచారాలకు పాల్పడే వారినుంచి మహిళలను కాపాడేందుకు ఉపకరించే ప్రత్యేకమైన లోదుస్తులను చెన్నైలోని ముగ్గురు ఆటోమొబైల్‌ ఇంజినీర్లు రూపొందించారు. వీటిని జీపీఎస్‌ మాడ్యూల్స్‌తో రూపొందించారు. జీపీఎస్‌, జీఎస్‌ఎం సాంకేతికతలను వీటికి అనుసంధానించారు. దానివలన.. అమ్మాయిలపై ఎవరైనా లైంగిక దాడికి యత్నిస్తే.. వారి తల్లిదండ్రులకు , పోలీసులకు ఆటోమేటిగ్గా ఎస్సెమ్మెస్‌లు వెళతాయి. 

అలాగే దాడికి ప్రయత్నించిన వారికి షాక్‌ కొట్టేలా కూడా ఏర్పాటు చేశారు. ఆ రీతిగా ప్రెజర్‌ సెన్సర్లు ఏర్పాటు చేశారు. ఈ సరికొత్త ఉత్పత్తికి 'షి' అని పేరు పెట్టారు. ఏప్రిల్‌లోనే వీటిని మార్కెట్‌లోకి విడుదల చేయాలని కూడా వీరు అనుకుంటున్నారు. 

సామూహిక అత్యాచారాలు, ఒంటరిగా ఉన్న మహిళలపై అత్యాచారాలు వంటివి ఎక్కువవుతున్న వార్తలు చూసి వాటికి అడ్డుకట్ట వేసే ఆలోచనతో వీటిని రూపొందించారట. 

More Telugu News